సూర్యాపేట జిల్లా: ఏప్రిల్ 14 నుంచి జరిగే ఫైర్ సర్వీసు వారోత్సవాల పోస్టర్స్ మరియు పాంప్లెట్స్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టే జానయ్య యాదవ్ లతో కలసి ఆవిష్కరించారు.1944 ఏప్రిల్ 14 వ తేదీన ముంబై విక్టోరియా డాక్ యార్డ్ లో ఒక నౌకకు అగ్నిప్రమాదం సంభవించినది.అగ్ని ప్రమాదంను నియంత్రించే క్రమంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాసినారు.విధి నిర్వహణలో అసువులు బాసిన అగ్నిమాపక దళ సిబ్బందికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 తేది వరకు దేశ వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ సందర్బంలో కర్తవ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి జోహార్లు అర్పించడం,వారి ఆత్మలశాంతికి ప్రార్థించడం, ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాలసిన జాగ్రత చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగంగా పోస్టర్లు,కరపత్రాలు విడుదల చేయడం జరిగిందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు.