పూర్వకాలంలో ప్రజలు చాలా రకాల రుచికరమైన వంటకాలను ఇంట్లోనే వండుకొని తినేవారు.ముఖ్యంగా చెప్పాలంటే అప్పటి వంటకాలు అయినా ఉలవచారు( Horse gram ) లాంటివి ఇటీవల మళ్ళీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ఉలవచారు బిర్యానీ లాంటివి ఇప్పుడు చాలా ఫేమస్ గా మారిపోయాయి.
మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉలవల్ని ఎక్కువగా ఆహారంలో ఉపయోగిస్తూ ఉన్నారు.ఇవి వేడి చేసే లక్షణాలని కలిగి ఉంటాయి.
అందుకోసం చలికాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే ఇవి చెడు కొలెస్ట్రాల్ ఊబకాయాన్ని కూడా తగ్గిస్తాయి.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నివారించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

మరి ముఖ్యంగా కిడ్నీలలో రాళ్లు లాంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయి.ఏ ఏ ఆరోగ్య సమస్యలకు ఇవి ఎలా పనిచేస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది కిడ్నీలో రాళ్ల వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు.అలాంటి వారు ఐదు గ్రాముల ఉలవల్ని తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి.
రాత్రి వంద మిల్లీ లీటర్ల నీటిలో వాటిని వేసి ఉదయం వరకు నానబెట్టాలి.ఉదయాన్నే వాటిని కాస్త మెత్తగా చేసి నీటిని వడగట్టుకోవాలి.
దీన్ని పరిగడుపున రోజు తాగడం వల్ల కిడ్నీలలోని రాళ్లు ( Kidney Stones )దూరమైపోతాయి.

అలాగే శరీరంలో వాత, కఫా, దోషా అసమతుల్యత వల్ల అజీర్ణ సమస్యలు( Digestive problems ) కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.క్లోమంలోని కణాల పై ప్రభావం చూపించి ఇన్సులిన్ విడుదలకు ఆటంకం కలిగిస్తాయి.ఫలితంగా మధుమేహం సమస్య వస్తుంది.
ఉలువలు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.మూడు గ్రాముల చొప్పున భోజనం తర్వాత తింటే అజీర్ణ సమస్యలు దూరం అయిపోతాయి.
మనలో కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం వల్ల ఊబకాయం బరువు పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి.ఉలువలతో ఈ సమస్య పరిష్కారమవుతుంది.100 గ్రాముల ఉలవల్ని తీసుకుని వాటిని లీటర్ నీళ్లలో వేసి చిన్న మంట మీద కనీసం రెండు గంటలైనా మరిగించాలి.నీరు సగానికి వచ్చాక ఆ నీటిని వడకట్టి తాగాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.