రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
ముందుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మరోసారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కవ్వింపు చర్యలు కొనసాగాయని తెలుస్తోంది.
బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణ చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు.







