సీనియర్ ఎన్టీఆర్ రెండో కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి( Daggubati Purandeshwari ) దగ్గుబాటి వెంకటేశ్వరరావుని( Daggubati Venkateswara Rao ) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఆమె భర్త ఎం.
బీ.బీ.ఎస్ చేశారు.దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్‌లో ఒక బీజేపీ రాజకీయ పార్టీ నాయకురాలు.
ఆమె 1959, ఏప్రిల్ 22న జన్మించారు.ఆమె ఇంతకు ముందు రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో మంత్రిగా పనిచేశారు.
ఈ దగ్గుపాటి దంపతులకు ఇద్దరు సంతానం.అయితే పురందేశ్వరి వెంకటేశ్వరరావుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అనే డౌట్ చాలా మందిలో ఉంది.
ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అడిగారు దానికి పురందేశ్వరి ఆసక్తికర సమాధానం చెప్పారు.
ఆమె మాట్లాడుతూ.“మా పెళ్లి ప్రేమ పెళ్లి కాదు.మా మ్యారేజ్ ఒక కుండ మార్పిడి పెళ్లి లాగా జరిగింది.
మా ఆయన (వెంకటేశ్వరరావు) వచ్చేసి మా వదినకు తమ్ముడు.సాధారణంగా మా ఇంట్లో బాగా చదువుకున్నాడు ఆ అబ్బాయి (వెంకటేశ్వరరావు), మంచోడు, అందగాడు అని మాట్లాడుకునేవారు.
అతడికి పురందేశ్వరిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని కొన్నిసార్లు చర్చించారు.వారు చర్చించడం తప్పితే నేను ఎప్పుడూ హద్దులు దాటి అతనితో మాట్లాడలేదు.ఒకసారి మా తాతయ్య ఆ డాక్టర్ అంటే అంత ఇష్టం ఉంటే అతన్ని తీసుకొని వెళ్ళిపోరాదు అని అనేవారు.” అంటూ నవ్వేశారు.
దాంతో పురందేశ్వరి పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలిసిపోయింది.ఇకపోతే దగ్గుబాటి పురందేశ్వరి తల్లిదండ్రులు ఎన్.టి.రామారావు, బసవతారకం.ఆమె చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ అనే పాఠశాలలో చదువుకున్నారు.ఆమెకు 10 మంది తోబుట్టువులు ఉన్నారు.
ఆమె రెండవ అమ్మాయి.ఆమె 1979లో చెన్నైలోని ఒక కళాశాల నుండి సాహిత్యంలో పట్టా పొందారు.
ఆమె 1996లో ఒక సంస్థ నుండి రత్నాల గురించి కూడా నేర్చుకున్నారు.ఆమె 1997లో హైదరాబాద్‌లో తన స్వంత రత్నాలు, ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఆమెకు ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ, ఫ్రెంచ్ అనే ఐదు భాషలు తెలుసు.భారతీయ నృత్యంలో ఒక రకమైన కూచిపూడిలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది.
ఆమె 1979లో దగ్గుబాటి వెంకటేశ్వరరావును వివాహం చేసుకున్నారు.వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు: నివేదిత అనే అమ్మాయి, హితేష్ అనే అబ్బాయి.వారి సినిమాల్లోకి గాని, రాజకీయాల్లో గానీ ప్రవేశించలేదు.