కార్గిల్ యుద్ద వీరుడికి ఘన నివాళి

సూర్యాపేట జిల్లా( Suryapet District ):భారత్,పాకిస్తాన్ కు మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం వెటరన్ గోపయ్యచారి చేసిన త్యాగం చిరస్మరణీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కో ఆర్డినేటర్,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ చౌదరి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరుడు గోపయ్య చారి 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 Tribute To Kargil War Hero , Suryapet District , India And Pakistan , Kargil-TeluguStop.com

సూర్యాపేట రోడ్డులోని ప్రధాన రహదారిపై ఆయన విగ్రహానికి ఆయన సతీమణి,వీరనారి శారద,కూతురు మౌనికతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాల త్యాగ ఫలితంగానే నేడు స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు.

గోపయ్య చారి కార్గిల్ యుద్ధంలో శత్రువులతో భీకరంగా పోరాడి దేశం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు.నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఫ్యాట్రన్స్ ప్రగతి నాగేశ్వరరావు,జగనీ ప్రసాద్, వెటరన్ జనరల్ సెక్రటరీ ఉపేందర్ రావు( Veteran General Secretary Upender Rao ),ట్రెజరర్ వెంకన్న,పిఆర్వో శేకు రమేష్, యూత్ వింగ్ సభ్యులు లక్ష్మీనారాయణ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube