సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey Mandal) వ్యాప్తంగా పశువులకు తాగునీటి కొరత తీవ్రమైంది.గత వర్షాకాలంలో సరైన వర్షాలు పడక వేసవి ప్రారంభంలోనే చెరువులు, కుంటలు,బావులు,బోర్లు కూడా అడుగంటాయి.
వేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయితీవ్ర నిరాశలో ఉన్న రైతులకు( farmers) ఇప్పుడు పశువుల దాహార్తి తీర్చడం గగనంగా మారింది.ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు అడుగంటి పోవడంతో వేసవిలో పశువులకు తాగునీరు దొరికే పరిస్థితి లేక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
వేసవిలో పశువులను వదిలిపెడితే ఇష్టారాజ్యంగా తిరిగి ఎక్కడ నీరుంటే అక్కడికి వెళ్లి దాహం తీర్చుకునేవి, కానీ,ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.
గతంలో కరువు పరిస్థితులు( Drought conditions ) ఏర్పడినప్పుడు ఆవాసాలతో సహా అన్ని గ్రామాల్లో పశువుల కోసం నీటితొట్లు నిర్మించారు.
కొన్నేళ్లుగా వాటి నిర్వహణ లేక కొన్ని శిధిలమైపోగా, కొన్ని మైనర్ రిపేర్ చేస్తే వాడుకలోకి వచ్చేలా ఉన్నాయి.ప్రభుత్వం స్పందించి నీటితొట్లను వినియోగంలోకి తేవాలని, లేని దగ్గర కొత్తగా నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.