వాటర్ హెడ్ ట్యాంక్ పై మూతలేక నీరు కలుషితం

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కేంద్రంలో తాగు నీరందించే స్టోరేజ్ వాటర్ హెడ్ ట్యాంక్ పై గత కొంత కాలంగా మూత లేకపోవడంతో దుమ్ము ధూళితో పాటు పక్షులు,జంతు కళేబరాలు,కోతులు ట్యాంక్ లో పడిపోయి త్రాగునీరు కలుషితమైతుందని,ఆ నీరు తాగుతున్న ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామ పంచాయితీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కలుషితమైన నీరు త్రాగి రోగాల బారిన పెడుతున్నామని వాపోతున్నారు.

 If The Water Head Tank Is Not Covered, The Water Will Be Contaminated , Covered,-TeluguStop.com

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని,ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.ఇదే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ వివరణ కోరగా వాటర్ ట్యాంకుపై మూత లేని విషయం ఇంతవరకు తనకు తెలియదని,వెంటనే వాటర్ ట్యాంక్ పై మూత ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube