డబుల్ బెడ్ రూం అక్రమాలపై అధికారులు సమాధానం చెప్పాలి: ఉత్తమ్ పద్మావతి

సూర్యాపేట జిల్లా:అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కేంతవరకు అఖిలపక్ష పార్టీలను కలుపుకొని పోరాటాలు ఉదృతం చేస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి( Uttam Padmavathi ) అన్నారు.బుధవారం అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్( Double bedroom ) ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మోతె మండల కమిటీ ఆధ్వర్యంలో మోతె తాహాసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాకు ఆమె సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.

 Officials Should Answer On Double Bedroom Irregularities: Uttam Padmavathi , Mu-TeluguStop.com

మోతె మండలంలో రావిపహాడ్,అప్పన్నగూడెం,విభలాపురం,నాగయ్య గూడెం గ్రామాలలో నిర్మించిన150 ఇండ్లను అర్హులకు ఇవ్వకుండా అర్హతలేని వారికి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.ఈ నాలుగు గ్రామాలలో దళితులు,బడుగు, బలహీన వర్గాలు, వికలాంగులు,ఒంటరి మహిళలు ఉన్నారని, వారికి కాకుండా వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలు,ఇండ్లు ఉన్నవారికి ఎందుకు ఇచ్చారో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అప్పన్నగూడెం గ్రామంలో లబ్ధిదారుల లిస్టు ఫైనల్ కాకుండా చాలామంది అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమించుకొని అందులో నివాసం ఉంటున్నారని, అధికారులు వారిని వెంటనే ఖాళీ చేయించి, అక్రమంగా చొరబాటుకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.రేషన్ కార్డులు సైతం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు.

గత సంవత్సర కాలంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలపై ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సాధించేంతవరకు అఖిలపక్షాలను, ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.

ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండలో ధర్నా నిర్వహించిన అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిటి సోమపంగు సూరయ్యకు అందజేశారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు,కొలిశెట్టి యాదగిరిరావు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు( Mulakalapalli Ramulu ), ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వినోద్ నాయక్,ధనియాకుల శ్రీకాంత్ వర్మ( Srikanth Varma),కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి,మండల నాయకులు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి,కోట సుధాకర్ రెడ్డి,కోట మధుసూదన్ రెడ్డి,సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సోమగాని జానకి రాములు,బండారు ప్రభాకర్ రెడ్డి,బోళ్ల వెంకటరెడ్డి,అర్హులైన లబ్ధిదారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube