సూర్యాపేట జిల్లా:గత కొద్ది రోజులుగా దినపత్రికల్లో పేటలో అక్రమ నిర్మాణాలపై వస్తున్న వార్తాకథనాలపై సూర్యాపేట జిల్లా అధికారులు స్పందించారు.మున్సిపాలిటీ,టౌన్ ప్లానింగ్ అధికారులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సూర్యాపేట పట్టణంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను జెసిబి సాయంతో కూల్చే పనిలో పడ్డారు.దీంతో పట్టణంలో ఉన్న అక్రమ నిర్మాణాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అక్రమ నిర్మాణాలను కూల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమవ్వగా వారిని ఎలా అడ్డుకోవాలా అనే పనిలో అక్రమనిర్మాణదారులు దారులు వెతుకున్నారు.ఇవేవీ పట్టించుకోకుండా అధికారులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు.