సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం ఏదైనా,పార్టీలు మారినా ఆ గ్రామానికి సంక్షేమ పథకాలు వర్తించాల్సిందే.అదే ఆ గ్రామానికి ఉన్న స్పెషల్.
వివరాల్లోకి వెళితే.సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో 16 గ్రామపంచాయతీలు ఉండగా అందులో గుడిబండ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గ్రామంగా అధికారులు,నాయకులు ఎన్నుకున్నారు.
దాంతో గుడిబండ గ్రామస్తులను సంక్షేమ పథకాలు వర్తిస్తుండడంతో గ్రామస్తులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధువు,పైలెట్ ప్రాజెక్ట్ గా గుడిబండ గ్రామమే ఎంపికైంది.
దీంతో గ్రామస్తులు, అధికారులు,నాయకులు 100 మంది లబ్ధిదారులను దళిత బంధువుకు ఎంపిక చేశారు.కాగా అప్పుడు గుడిబండ గ్రామం రాష్ట్రంలోనే చర్చనీయశంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గ్రామంగా ఎంపిక చేశారు.తొలుత తొగర్రాయి పైలెట్ ప్రాజెక్ట్ కి ఎంపిక చేసినట్లు వార్తలు రాగా దానిని గుడిబండ గ్రామానికి మార్చారు.
దీంతో గ్రామంలో ఉన్న దాదాపు అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా గ్రామ ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకున్నారు.కోదాడ మండలంలో గుడిబండ గ్రామం సంక్షేమ పథకాలకు ఎంపిక కావడంతో గ్రామం చర్చనీ అంశంగా మారింది.
గ్రామంలో ఆయా పార్టీలకు సంబంధించిన మండల, నియోజకవర్గ నాయకులు ఉండడంతో ఇది సాధ్యమైందని పలువురు చర్చించుకుంటున్నారు.
కోదాడ మండలంలో 16 గ్రామాలు ఉండగా గుడిబండ గ్రామాన్నే ఉన్న ఎందుకు పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు.?అని పలువురు ప్రశ్నిస్తున్నారు.అంతేకాకుండా ఇటీవల సంక్షేమ పథకాలు ప్రారంభ సభలో మా గ్రామాన్ని కాదని గుడిబండ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
ఎందుకని అధికారులను, ప్రజాప్రతినిధులను అడగకనే అడిగారు.దీంతో అర్థమవుతుంది సంక్షేమ పథకాలు అన్ని గ్రామాలకు సమానంగా అందే విధంగా చూడాలని పలు గ్రామాల వాసులు కోరుతున్నారు.