సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కుడకుడ గ్రామంలో గల 126 సర్వే నెంబర్లో అధికారులు ప్రత్యేకంగా సూచించిన సూచన బోర్డు పరిధిలో గల ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేసి,అమాయక ప్రజలకు అంటగట్టి చేతులు దులువుకుతున్నారని,అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఓ ప్రకటనలో తెలిపారు.ఈ స్థలంలో ఎలాంటి కట్టడాలు నిర్మాణం చేసినా ఖచ్చితంగా కూల్చివేసి ప్రభుత్వం ఆక్రమించుకుంటుందని అధికారులు చెబుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం అలాగే ఉంచామని అమాయక ప్రజలు మోసపోవద్దని అధికారులు అంటున్నారని,అందుకే ఎవరి మాయమాటలు విని ఆ స్థలాన్ని కొనుగోలు చేసి మోసపోవద్దని తెలియజేశారు.




Latest Suryapet News