సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం గొండ్రియాలలోని పల్లె దవాఖాన మందు బాబులకు అడ్డగా మారింది.రాత్రివేళ కొందరు ఆకతాయిలు మద్యం సేవించి కాళీ సీసాలను కూడా అక్కడే పడేస్తున్నారు.
అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.పల్లె దవాఖానలో డాక్టర్ లేక, ఏఎన్ఎం విధులకు రాక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని,
ఉదయం 11 గంటల సమయంలో పల్లె దవాఖాన మెట్ల వద్ద తాగిపడేసిన బీరు సీసాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే మందు బాబులకు పల్లె దావాఖాన అడ్డగా మారిందని వాపోయారు.ఈ విషయంపై వైద్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు.