సూర్యాపేట జిల్లా:మునగాల మండలం( Munagala mandal ) ముకుందాపురం వద్ద 65వ,జాతీయ రహదారిపై శుక్రవారం కారు బైకును ఢీ కొట్టడంతో ఒకరు స్పాట్ లో మృతి చెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు సూర్యాపేట జిల్లా( Suryapet District ) చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి(55)గా గుర్తించారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ఏరియా హాస్పిటల్ కి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.