హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది అందరిలోనూ ఉంటుంది.కానీ కొందరిలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది.
ఎంతలా అంటే హెయిర్ ఫాల్ సమస్యను కంట్రోల్ చేసుకునేందుకు మందులు కూడా వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు ఆందోళన పడొద్దు.ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బకు పరార్ అవుతుంది.
పైగా ఈ ఆయిల్ కోసం కేవలం మూడు పదార్థాలు ఉంటే చాలు.మరి ఆ మూడు ఏంటి.వాటితో హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ ఆయిల్ ను( Hair Fall Controlling Oil ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెలో పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల తో పాటు మెంతుల పొడిని వేసి స్పూన్ సహాయంతో తిప్పుకుంటూ ఉడికించాలి.
దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై ఆయిల్ ను మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ ఆయిల్ ను నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.
మరుసటి రోజు మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలమన్నా రాలదు.హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య( Dandruff ) కూడా పోతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకునే వాడేందుకు ప్రయత్నించండి.