వృద్ధురాలన్న జాలి లేకుండా, మానసిక సమస్యతో బాధపడుతున్నదని తెలిసి కూడా ఆసుపత్రిలో ఆమెను పదే పదే కొట్టి చంపిన మహిళకు యూకే న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ సిటీ ఆసుపత్రిలో( Birmingham City Hospital in Britain ) 2021, జనవరి 22న ఈ ఘటన జరిగింది.
మృతురాలిని 83 ఏళ్ల విద్యా కౌర్‌గా( Vidya Kaur ), నిందితురాలిని ఫిలోమినా విల్సన్( Philomena Wilson ) (56)గా గుర్తించారు.విల్సన్ తొలుత ఈ ఘటనల గురించి తనకు ఎలాంటి జ్ఞాపకం లేదని చెప్పగా.
తర్వాత హత్యానేరాన్ని అంగీకరించింది.
ఈ నేరానికి గాను శుక్రవారం ఫిలోమినాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్ట్( Birmingham Crown Court ).నిందితురాలు తాత్కాలిక మతిమరుపు సమస్యతో బాధపడుతోందని, మృతురాలిపై దాడి సమయంలో ఆమె డ్రగ్స్, ఆల్కహాల్‌ను సేవించి వున్నట్లుగా కోర్టుకు తెలియజేశారు.విద్యా కౌర్ మరణించిన మూడు వారాల తర్వాత ఆమె మరణానికి కారణం తెలిసింది.
విద్యా కౌర్ తలకు తీవ్రగాయాలు కాగా.పుర్రెలో పగుళ్లను గుర్తించారు వైద్యులు.
ప్రాసిక్యూటర్ మైఖేల్ బర్రోస్( Prosecutor Michael Burrows ) మాట్లాడుతూ.ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో ఒక నర్సు కౌర్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్తుండగా విల్సన్ మంచంపై నుంచి లేచి విద్యా కౌర్‌పై దాడి చేసింది.మృతురాలు కిందపడిపోగా.నర్సును పక్కకు నెట్టేసి, కౌర్ తలను నేలకేసి మోదింది.దీనిని గమనించిన మరో రోగి, హెల్త్ వర్కర్‌లు దాడిని అడ్డుకునేందుకు యత్నించగా.విల్సన్ వారిపైనా దాడి చేసింది.
చివరికి సెక్యూరిటీ గార్డులు రంగ ప్రవేశం చేసి విల్సన్‌ను మంచం వద్దకు తీసుకెళ్లి బంధించారు.
మానసిక అనారోగ్యం వున్నప్పటికీ విల్సన్ తాను ఏం చేస్తున్నది, ఎలా ప్రవర్తిస్తున్నది తెలుసునని లాయర్ కోర్టుకు వివరించారు.నేలపై పడిపోయిన విద్యా కౌర్ స్పృహ కోల్పోయినప్పటికీ.ఆమెపై విల్సన్ విచక్షణారహితంగా దాడి చేస్తూనే వుందని ప్రాసిక్యూటర్లు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.
శిక్ష విధించే సమయంలో న్యాయమూర్తి మెల్‌బోర్న్ ఇన్మాన్( Melbourne Inman ) మాట్లాడుతూ.విద్యా కౌర్ అత్యంత వృద్ధురాలని, పైగా ఆమె ఆరోగ్యం కూడా బాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి నిస్సహాయ మహిళపై జరిగిన ఈ దుర్మార్గపు దాడి వెనుక నిందితురాలి అసలు ఉద్దేశం చంపడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.