ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి వస్తోంది అంటే చాలు చర్మం( Skin ) పై ఎక్కడా లేని శ్రద్ధ పుట్టుకొస్తుంది.ముఖ చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు.
ఈ క్రమంలోనే బ్యూటీ పార్లర్ కి వెళ్లి టాన్ రిమూవల్, బ్లీచ్, ఫేషియల్ వంటివి చేయించుకుంటూ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ స్క్రబ్ ను కనుక ఉపయోగిస్తే సహజంగానే మీ చర్మం మిళమిళ మెరిసిపోతుంది.

బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచురల్ స్క్రబ్ ( Natural scrub )ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు( Papaya slices ) వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న బొప్పాయి పండు ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్,( Sugar powder ) రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు ( Curd )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.మూడు నాలుగు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.
చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. బ్యూటీ పార్లర్ ( Beauty parlour )అవసరం లేకుండానే మీరు మిళమిళ మెరిసిపోతారు.
చర్మం చాలా నిగారింపుగా కనిపిస్తుంది.కాబట్టి ఇకపై బ్యూటీ పార్లర్ లో వేలకు వేలు ఖర్చు పెట్టడం మానేసి ఈ న్యాచురల్ స్క్రబ్ ను ప్రయత్నించండి.
అందంగా మెరిసిపోండి.