మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలకులు దిగిపోవాలి.ప్రగతిశీలా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.
రమ,చండ్ర అరుణ.
సూర్యాపేట జిల్లా:ప్రతి మహిళ ప్రగతిశీల చైతన్యంతో తమను తాము కాపాడుకోవటంలో ముందుండాలని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కట్టా రమ,చండ్ర అరుణ మహిళా లోకానికి పిలుపునిచ్చారు.ప్రతి మహిళా సమానత్వం కోసం,సమసమాజం కోసం పోరాడాలని,మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలకులు దిగిపోవాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు నుండి పబ్లిక్ క్లబ్ వరకు మహిళా ప్రదర్శన నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో వారు మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని,మొన్న మైనర్ బాలికపై,నిన్న ఖమ్మంలో గర్భిణీ స్త్రీ పై కామాంధుల చేసిన పైశాచికత్వం చూస్తే మహిళల రక్షణ విషయంలో పాలకులు అనుసరిస్తున్న తీరు తేటతెల్లమవుతుందని అన్నారు.
దేశంలో ఇలా ప్రతి మూడు నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురవుతుందని తెలిపారు.ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని,దీనికి కారణం ప్రభుత్వాల అసమర్థతని అన్నారు.
డబ్బున్న వారు, అధికార పార్టీ నాయకులు వారికి సంబంధించిన వారు మహిళలపై అఘాయిత్యాలు చేస్తే పట్టించుకోని పోలీసులు అమాయకులు అయితే ఎన్కౌంటర్లు చేస్తారని,చట్టాలను ఉన్నవాడి చుట్టాలుగా మారుస్తున్నారని,అందుకే ప్రతి మహిళ ప్రగతిశీల పోరాట స్ఫూర్తితో చైతన్యంతో తనకు తాను రక్షించుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళ సంఘం జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక,పూలన్,ప్రజా పంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్,ప్రజా పంథా కోదాడ డివిజన్ కన్వీనర్ అంజన్న,తుంగతుర్తి డివిజన్ కన్వీనర్ రామన్న,రాధిక జిల్లా నాయకులు అఖిల్,జయమ్మ,చంద్రకళ,ఐ.
ఎఫ్.టి.యు జిల్లా కన్వీనర్ రామోజీ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.