నేరేడుచర్ల పట్టణానికి చెందిన కొణతం గమన్ రెడ్డి( K Gaman Reddy ) జిటిఎ తైక్వండో అధ్వర్యంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఓపెన్ తైక్వండో చాంపియన్షిప్- 2024( Greater Hyderabad Open Taekwondo Championship 2024 )అండర్ 25 కిలోల విభాగంలో గోల్ద్ మెడల్ సాధించి,బ్లాక్ బెల్ట్( Black Belt ) కి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.గమన్ రెడ్ది 2024 లో నేపాల్,శ్రీలంక, అర్జెంటీనాలో జరిగే ప్రపంచస్థాయి క్రీడలకు సన్నద్ధమవుతున్నాడు.
ఇప్పటి వరకు జిల్లా,రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ స్తాయిలో మొత్తం 6 మెడల్స్ (గోల్డ్-3,సిల్వర్-3) గమన్ రెడ్డి సాధించాడు.హైదరాబాద్ అల్కాపూర్ టౌన్ షిప్ లోని స్కాలర్స్ అకాడమిలో 4వ తరగతి చదువుతున్న గమన్, టౌన్ షిప్ లో ఉన్న కోచ్ సైకం సుబ్బారావు ఎస్ఐటిఎస్ సంస్థలో శిక్షణ పొందుతున్నారు.
గమన్ రెడ్డి నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి, విజయలక్ష్మిల మనుమడు.గమన్ రెడ్డి విజయాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఉదయ్ కుమార్ రెడ్డి,శోభన కుటుంబ సభ్యులు, ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు,స్కాలర్స్, అకాడమి ఉపాధ్యాయులు నేరేడుచర్ల పట్టణంలోని పలువురు అభినందనలు తెలిపారు.