సూర్యాపేట జిల్లా:రాత్రి పూట ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన నైట్ డ్యూటీ కానిస్టేబుల్ వ్యవహారం సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసి,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చింతలపాలెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి రాత్రిపూట వచ్చింది.
ఆ సమయంలో స్టేషన్ లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను తనకు చదువురాదని ఫిర్యాదు రాయాలని కోరగా,సదరు కానిస్టేబుల్ ఆమె పట్ల దురుసుగా మాట్లాడుతూ స్టేషన్ నుండి వెళ్లిపో,ఫిర్యాదు రాసుకొని రాపో అంటూ మాట్లాడిన దృశ్యాన్ని బాధితురాలి పక్కన వచ్చిన వ్యక్తి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వాళ్లకు ఫిర్యాదు రాయడం రాదంటే జర రాసి పెట్టవచ్చుగా పోలీసు అన్నా,లేదా రాయించుకొని వచ్చి ఉదయం ఇవ్వమని కూడా చెప్పవచ్చు కదా పోలీసు అన్నా, బాధితులతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడం ఏ విధమైన ఫ్రెండ్లి పోలీసింగ్ పోలీస్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చదువురాని వారి దగ్గర కూడా టచ్ సెల్ ఉంటుందనే విషయం పాపం చదువొచ్చిన పోలీసు అన్నకు తెలియకపోయే,చదువులో రానించలేక పోయినా ఇలాంటి వాటిలో ఫాస్ట్ గా ఉంటారని అంటూ సైటర్లు వేస్తున్నారు.జర జాగ్రత్త పోలీసు అన్నా మీరు ప్రజల కోసమే పని చేస్తున్నారని తెలుసుకోండి అంటూ ఎత్తిపొడిస్తున్నారు.
అయ్యా పోలీసు ఉన్నతాధికారుల్లారా మీ పోలీస్ కానిస్టేబుళ్లు అమలు చేస్తున్న ఫ్రెండ్లి పోలీసింగ్ పట్ల జర నజర్ పెట్టండి సార్లూ అంటున్నారు.