సూర్యాపేట జిల్లా:సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచిన అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంగళవారం పెంచిన,గ్యాస్,డీజిల్,పెట్రోల్,కరెంట్,ఆర్టీసీ,భూ రిజిస్ట్రేషన్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి కోరుతూ గరిడేపల్లి మండల కేంద్రంలోని కోదాడ-మిర్యాలగూడ ప్రధాన రోడ్డుపై సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ ప్రభుత్వం,రాష్టంలో అధికారంలో వున్న కెసిఆర్ ప్రభుత్వం పోటీపడి నిత్యావసర వస్తువుల ధరలను రోజు వారీగా పెంచుతూ పోతున్నారని విమర్శించారు.పెరుగుతున్న ధరలతో సామాన్య మానవుడు ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేకుండా పస్తులు ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులన్నిటిని ప్రైవేటీకరణ చేస్తూ,ఆదాని,అంబానీ లకు అమ్ముకుంటున్నారని,ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమై దేశాన్ని అప్పుల ఉబిలోకి లాగితే, రాష్టంలో అధికారంలో వున్న తెరాస ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు,విలువైన భూములు అమ్ముతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో బడా కాంట్రాక్టులన్నీ బడా కంపెనీలకిచ్చి, బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణ చేసి, ఆసరా పింఛన్లు,ఉద్యోగస్తులకు జీతాలు నెల చివరి వరుకు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ త్రిపురం సుధాకర్ రెడ్డి,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బాదే నర్సయ్య,సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి,కుందూరు వెంకటరెడ్డి,వ్యవసాయకార్మిక సంఘం మండల కార్యదర్శి తాళ్ల తిరపయ్య,జొనలగడ్డ తిరపయ్య, ఇదా నాగయ్య,కేతిరెడ్డి సంజీవరెడ్డి,బండ రంగారెడ్డి, మాతంగి పాపయ్య,దానెలు,పోకల నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.