సూర్యాపేట జిల్లా:రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఊహించని ఫలితాలు వస్తాయని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వరరావు అన్నారు,బుధవారం నేరేడుచర్ల పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్న 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు తెలిపారు.నియోజకవర్గంలో 1500 పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేశామని చెప్పారు.
ఈ సభ్యత్వంతో ప్రమాద బీమా ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అన్నారు.పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలతో యువత ముందుకు వస్తుందని చెప్పారు.వివేకానందుడు యువతని మేల్కొల్పితే,పవన్ కళ్యాణ్ యువతని రాజకీయాల వైపు మేల్కొల్పాడని చెప్పారు.నియోజకవర్గంలో జనసేనకు సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి జనసేన క్రియ శీల సభ్యుడు ఒక సైనికుడిలా, ఒక వ్యపన్లా 30 మందితో సమానం అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు ఖాంపల్లి వెంకట్,సిహెచ్.
రామలింగం,లొట్లపల్లి పూర్ణచంద్రరావు, కొమ్మరాజు శ్రీను,నాగచారి, నేరేడుచర్ల,గరిడేపల్లి, పాలకవీడు మండలాల జన సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.







