సూర్యాపేట జిల్లా:స్వాతంత్ర్య ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయమైనదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.దివంగత భారత మాజీ రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతిగా కాకుండా ఉపాధ్యాయు వృత్తికే ప్రాధాన్యత ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు.
గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యూగందర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,జడ్పి వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాద్యాయుడి పేరుతో ఉపాద్యాయ దినోత్సవం జరుపుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగమైందన్నారు.స్వాతంత్ర్యనికి పూర్వం విద్య అందుబాటులో ఉండక పోవడం,ప్రజల మధ్యన అంతరాలు సృష్టించడం వంటి పరిణామాల నేపద్యంలో చిన్న చిన్న దేశాలు కుడా భారతదేశం మీదకు దండయాత్ర కు వచ్చాయన్నారు.
అంతే కాకుండా విద్య లేమితోటే దేశం పరాయి పాలకుల వశమైందన్నారు.అటువంటి సమయంలో ఉపాధ్యాయులు కేవలం తరగతి గదులకే పరిమితము కాకుండా స్వాతంత్ర్య సంగ్రామంలో వారు పోషించిన పాత్ర శ్లాఘనీయమైందని ఆయన కొనియాడారు.
నాటి నుండి నేటి వరకు విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వారిలో సృజనాత్మకను ఉపాద్యాయులు వెలుగులోకి తెచ్చినందునే దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుందన్నారు.ఎందరెందరో ఉన్నతులను తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం పేరుతో వారిని సత్కరించటం అనిర్వచనీయమైన ఘట్టంగా ఆయన వర్ణించారు.
అనంతరం సూర్యాపేట జిల్లాలో ఉత్తమ ఉపాద్యాయులుగా ఎంపీకయిన వారిని మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా సన్మానించారు.