సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి మూసి బ్రిడ్జి వద్దనున్న టోల్గేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.టోల్గేట్ నుండి 20 కిలోమీటర్ల వరకు వాహనదారులకు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎట్టకేలకు స్పందించిన టోల్గేట్ యజమాన్యం ఆధార్ కార్డు,ఆర్సీ లేదా ఎమ్మార్వో పర్మిషన్ ఉన్నవారికి రాయితీ కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు,పలు సంఘాల నాయకులు,ఫోర్ వీలర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.







