సూర్యాపేట జిల్లా: సామాజిక భావాలను అభివృద్ధి పరిచిన వ్యక్తి సంత్ రవిదాస్ మహారాజ్( Santh Sri Ravidas ) అని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమతా మూర్తి సంత్ గురు రవి దాస్ మహారాజ్ 647 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఎమ్మార్పీఎస్( MRPS ) నాయకులు మాట్లాడుతూ ఎవరైతే తాము బతికిన కాలంలో ఎంతోమందికి తమ భావజాలంతో దిశానిర్దేశం చేశారో, అలాంటి వారిలో సంత్ రవిదాస్ ఒకరని కొనియాడారు.
ఆయన భక్తి కవుల్లో ఒక అధ్యాత్మిక భావాన్ని కాకుండా సామాజిక భావాలను అభివృద్ధి చేశారని,బానిస భావాలను,మానసిక బానిసత్వాన్ని,కుల బానిసత్వాన్ని,శరీర బానిసత్వాన్ని వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి రవి దాస్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అరుణ్,టౌన్ అధికార ప్రతినిధి సైదులు, మండల ఉపాధ్యక్షుడు సల్మాన్ రాజ్,సీనియర్ మండల నాయకులు శీను, జాను,విజయ్,వెంకటేష్,హుస్సేన్ పల్లయ్య, కరుణాకర్,వర్మ,సైదులు, సతీష్,సిద్ధూ,పవన్ తదితరులు పాల్గొన్నారు.