సూర్యాపేట జిల్లా: మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల గ్రామంలో ఆమంచి సతీష్ ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన 21 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని శనివారం పోలీసులు పట్టుకున్నారు.నమ్మదగిన సమాచారంతో మద్దిరాల ఎస్సై మధు నాయుడు తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని సోదాలు నిర్వహించగా
అక్రమంగా నిల్వ చేసిన బయటపడగా సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఎస్ఐ మాట్లడుతూ అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.