మధ్యాహ్నం పూట బెండకాయలను తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

సాధారణంగా బెండకాయను( Okra ) కొంతమంది తినడానికి ఇష్టపడితే, మరి కొంతమంది అంతగా ఇష్టపడరు.అయితే బెండకాయ కూర కాస్త జిగురుగా ఉన్నప్పటికీ ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

 Do You Know The Health Benefits Of Eating Okra In The Afternoon , Okra, Vitamin-TeluguStop.com

ప్రతిరోజు మధ్యాహ్నం పూట( afternoon ) బెండకాయ కూర తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.బెండకాయ కూరలు చాలా తక్కువ మంది తింటారు.

ఎందుకంటే ఈ కూర జిగురుగా ఉంటుంది.కానీ బెండకాయ మన ఆరోగ్యానికి చేసిన మేలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు.

బెండకాయలో మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

Telugu Calcium, Fiber, Glycemic Index, Tips, Immunity, Iron, Magnesium, Okra, Po

బెండకాయలో విటమిన్ ఏ, విటమిన్ కె, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ లాంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి.బెండకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి దీన్ని తినడం వలన డయాబెటిస్ పేషెంట్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

బెండకాయలు తినడం వలన రోజువారి ఆహారం నుండి కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.దీంతో గ్లోకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.బెండకాయల్లో గ్లైసిమిక్ ఇండెక్స్( Glycemic index ) చాలా తక్కువగా ఉంటుంది.అందుకే ఇది డయాబెటిస్ పేషెంట్లకు సిఫార్సు చేయబడుతుంది.

బెండకాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.ఈ ఫైబర్ మన జీర్ణ క్రియకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది.

Telugu Calcium, Fiber, Glycemic Index, Tips, Immunity, Iron, Magnesium, Okra, Po

బెండకాయలు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.బెండకాయలో విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది.అందుకే దీన్ని రెగ్యులర్ గా తినడం వలన ఇమ్యూనిటీ పవర్ ( Immunity power )పెరుగుతుంది.అంతేకాకుండా బెండకాయలు రెగ్యులర్గా తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి.

బెండకాయ కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రించడానికి సహాయపడుతుంది.అలాగే మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

బెండకాయలో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన ఇది మన ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube