సూర్యాపేట జిల్లా:కోదాడ నుంచి సూర్యాపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…65వ, జాతీయ రహదారిపై బ్రిడ్జి పక్కనే ఆగివున్న రోడ్డు రోలర్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.