బీసీలకు కాంగ్రెస్ 34 సీట్లు ఇవ్వాలి: కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర నేత తండు శ్రీనివాస్ యాదవ్

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.

 Congress Should Give 34 Seats For Bc Tandu Srinivas Yadav, Congress , 34 Seats ,-TeluguStop.com

ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో బీసీలకు టిక్కెట్ లు ఇవ్వలేదని,పలు జిల్లాలలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తున్నారని, మొదటినుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అసలు సిసలైన కాంగ్రెస్ వాదులకు టిక్కెట్లు ఇవ్వాలన్నారు.బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో కనీసం 34 టిక్కెట్లు ఇవ్వాలని,లేనిపక్షంలో పార్టీకి బీసీ సమాజం దూరమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ నాయకులు బెంజారపు రమేష్,పంత నర్సయ్య,గుంటి సైదులు ముదిరాజ్,బీసీ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube