భార్య మాట వినకుండా డ్రైవర్ డ్యూటీకి వెళ్ళిన భర్త...ఆత్మహత్య చేసుకున్న భార్య...!

సూర్యాపేట జిల్లా: కేవలం భర్త తన మాట వినలేదన్న మనస్తాపంతో ఓ భార్య గడ్డి మందు సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండాలో వెలుగులోకి వచ్చింది.అనంతగిరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.

 Wife Died As Husband Went To Driver Duty Without Listening To Her In Suryapet Di-TeluguStop.com

పాలవరం తండాకు చెందిన భూక్య రవి, అంజలి(24) భార్యాభర్తలు.వీరికి 2015 లో వివాహం కాగా ఒక కుమారుడు,ఒక కూతురు సంతనం కలరు.

సాఫీగా సాగిపోతున్న కాపురంలో డ్రైవింగ్ వృత్తి విషాదం నింపింది.డ్రైవర్ గా పని చేస్తున్న భర్త రవిని ఆ వృత్తి వదిలేసి ఏదైనా వేరే పని చూసుకోమని

భార్య అంజలి కోరింది.

డ్రైవింగ్ మాత్రమే తెలిసిన రవి దాన్ని విడిచి పెట్టలేక భార్యా వారిస్తున్నా వినకుండా డ్రైవింగ్ డ్యూటీకి వెళ్ళాడు.తన మాట వినలేదని భార్య అంజలి క్షణికావేశంలో ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఖమ్మం హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించింది.మృతురాలి తల్లి కౌసల్య తన కూతురు మరణంపై ఎటువంటి అనుమానం లేదని ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించామని ఎస్ఐ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube