తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల( Thungathurthi )కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది.శనివారం తాటిపాముల శ్రీలత( Srilath ) అనే గర్భిణీ రెండవ కాన్పు కోసం పురిటి నొప్పులతో ఆరోగ్య కేంద్రానికి వచ్చింది.

 Atrocity At Tungaturthi Social Health Centre Gynecologist , Suryapet , Thungathu-TeluguStop.com

ఆసుపత్రిలో ఆపరేషన్ చేసే డాక్టర్ లేకపోవడంతో హెడ్ సిస్టర్లు డెలివరీ చేస్తుండగా వైద్యం వికటించి పాప మృతి చెందింది.ఏమీ తెలియనట్టు తల్లీబిడ్డలను సూర్యాపేట( Suryapet ) ఏరియా హాస్పిటల్ పంపించారు.

ఏరియా ఆసుపత్రి వైద్యులు అప్పటికే పాప మృతి చెందిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ళ పర్యంతమయ్యారు.కనీసం గైనకాలజిస్ట్( Gynecologist ) లేకుండా స్టాఫ్ నర్స్ డెలివరీ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

జరిగిన సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube