తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల( Thungathurthi )కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది.
శనివారం తాటిపాముల శ్రీలత( Srilath ) అనే గర్భిణీ రెండవ కాన్పు కోసం పురిటి నొప్పులతో ఆరోగ్య కేంద్రానికి వచ్చింది.
ఆసుపత్రిలో ఆపరేషన్ చేసే డాక్టర్ లేకపోవడంతో హెడ్ సిస్టర్లు డెలివరీ చేస్తుండగా వైద్యం వికటించి పాప మృతి చెందింది.
ఏమీ తెలియనట్టు తల్లీబిడ్డలను సూర్యాపేట( Suryapet ) ఏరియా హాస్పిటల్ పంపించారు.ఏరియా ఆసుపత్రి వైద్యులు అప్పటికే పాప మృతి చెందిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ళ పర్యంతమయ్యారు.
కనీసం గైనకాలజిస్ట్( Gynecologist ) లేకుండా స్టాఫ్ నర్స్ డెలివరీ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని
ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జరిగిన సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Women’s Day 2025 : ముగ్గురు భారత సంతతి మహిళకు న్యూయార్క్‌లో సత్కారం