అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం పొలిటికల్ హై టెన్సన్ తో కూడిన హై డ్రామా నెలకొంది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్ట మధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 32 మంది అసమ్మతి వార్డ్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.

 Political High Drama Over No Confidence On Municipal Chairperson In Suryapet Dis-TeluguStop.com

వెంకట్రావ్ ప్రకటించారు.మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మపై కౌన్సిలర్ కొండపల్లి నిఖిల రెడ్డి వర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.

అనుకున్న సమయానికి జిల్లా కలెక్టర్,ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.కానీ,11:30 గంటల వరకు ఒక్క కౌన్సిలర్ కూడా రాకపోవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం కలెక్టర్ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు.దీనితో ఇంకాస్త హిట్ పెరిగింది.

అయినా ఎవరూ హాజరు కాకపోవడంతో కోరమ్ లేదని అవిశ్వాసం వీగిపోయిందని కలెక్టర్ ప్రకటించారు.బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పై సొంత పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన 32 మంది కౌన్సిలర్లు అవిశ్వాస‌ తీర్మాన నోటీస్ పై సంతకం పెట్టారు.

మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు శనివారం బలపరీక్ష ఏర్పాటు చేశారు.కాగా అసమ్మతి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కనిపించకపోవడంతో మిగిలిన 31 మంది కూడా అవిశ్వాస తీర్మాన సమావేశానికి గైర్హాజరయ్యారు.

దీనితో అవిశ్వాసం వీగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube