సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణ మున్సిపల్ కార్యాలయం( Neredcherla Municipality )లో శనివారం తాగునీటి సమస్యపై హుజూర్ నగర్ ఆర్డీవో వి.శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో నేరేడుచర్ల పట్టణంలోని ప్రజలందరికీ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను కోరారు.
నీటి ఎద్దడి ఉన్న వార్డులలో ట్యాంకర్లతో( Tankers ) నీటి సరఫరా చేయాలని సూచించారు.
పైప్ లైన్ లో లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని, తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ.అశోక్ రెడ్డి,కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది,వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.