సూర్యాపేట జిల్లా:కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని బి.మౌనిక రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ ఆదివారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీల మధ్య హైదరాబాద్ లో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో సౌత్ జోన్ చెస్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచి జేఎన్టీయూ పక్షాన రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.డిసెంబర్ 15 నుండి బెంగళూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో మౌనిక చెస్ క్రీడ నుండి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.
ఈ సందర్భంగా క్రీడాకారిణిని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్,అకడమిక్ డైరెక్టర్లు పోతుగంటి నాగేశ్వరరావు,డాక్టర్ సిహెచ్.నాగార్జున రావు,పిడి బాధిని శీను,పలు విభాగాల అధిపతులు,అధ్యాపకులు అభినందించారు.