సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని శిశుమందిర్ స్కూల్ ( Shishumandir School )సమీపంలో ఉన్న 50 ఫీట్ల రోడ్ లో డ్రైనేజీ పనుల కోసం గుంతలు తవ్వి రెండు నెలలు గడుస్తున్నా పనులు మొదలుపెట్టక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఒకప్పుడు ప్రధాన రహదారిగా ఈ రోడ్డు రానురాను కబ్జాలతో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడి,అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది.
పట్టణ ప్రజల సహకారం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు 50 ఫీట్ల రోడ్డు పరిరక్షణ సమితిగా ఏర్పడి గత కొంతకాలంగా పోరాడుతున్నా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పట్టణ ప్రజలతో పాటు విద్యార్థుల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే రోడ్డు సమస్యను తీర్చకుండానే మున్సిపల్ అధికారులు డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడడంతో గుంతలు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను వెంటనే పూడ్చాలని కోరుతున్నారు.