సూర్యాపేట జిల్లా: గురుకుల పాఠశాలలో 10 వ,తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్దులు ఆదివారం ఉదయం అదృశ్యమైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట ఆవాస గ్రామమైన నెమలిపురి (మునగాల) ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి 10వ,తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు మద్యం సేవించి గొడవపడ్డారని ఉపాధ్యాయులు,ప్రిన్సిపాల్ మందలించినట్లు తెలుస్తోంది.
దీనితో మనస్తాపానికి గురైన ఆరుగురు విద్యార్థులు ఆదివారం నుంచి గురుకుల పాఠశాలలో కనిపించకపోవడంపై ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించి,అనంతరం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సిరియస్ గా స్పందించిన కోదాడ రూరల్ పోలీసులు 24 గంటల్లోనే విద్యార్దుల మిస్సింగ్ కేసును ఛేదించి, విజయవాడలో ఉన్న ఆరుగురు విద్యార్దులను సురక్షితంగా కోదాడకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించి వారి కళ్ళల్లో ఆనందం నింపారు.
అయితే అసలు గురుకుల పాఠశాలలోకి మద్యం ఎలా వచ్చింది…? వచ్చిన మద్యం విద్యారులు ఎక్కడ సేవించారు…? వీడ్కోలు పార్టీలో ఏం జరిగింది…పార్టీలో ఉపాధ్యాయులకు,విద్యార్దులకు మధ్య ఘర్షణ వాతావరణం ఎందుకు చోటు చేసుకుంది…? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు,అంతేకాకుండా గురుకులంలో జరుగుతున్న పలు సంఘటనలపై కూడా విచారణ చేస్తున్నామని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.