సూర్యాపేట జిల్లా:సైబర్ నేరాల నియంత్రణ అంశంపై రాష్ట్ర డీజీపీ బుధవారం జిల్లా అధికారులు, కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం నుండి హాజరైన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్,ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సాంకేతికత అభివృద్ధితో పాటుగా సైబర్ నేరాల పెరుగుతున్నాయని,భవిష్యత్తులో ఈ సైబర్ నేరాలు పోలీసు శాఖకు సవాలుగా ఉంటాయన్నారు.కావున సైబర్ నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖ సన్నద్ధం కావాలని,మంచి టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలని,టెక్నాలజీ పరంగా సిబ్బందిని చైతన్య పరచాలని సూచనలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ మరియు మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్ మరియు ఇతర ఐటీ కంపెనీలతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నదే,సైబర్ క్రైమ్ నియంత్రణకు ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇనిస్టిట్యూట్ (Center of Excellence Institute)ను త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.ఈ ఇనిస్టిట్యూషన్స్ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర డిజిపి పర్యవేక్షణలో ఉంటుందని,రాబోయే రోజులలో సైబర్ క్రైమ్ నియంత్రణలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీని ఎంతో తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
దాని ద్వారా నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందని,ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ అప్లికేషన్స్ మరియు సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ సంబంధించిన పుస్తకాలు అన్ని జిల్లాలకు,కమిషనరేట్లకు ఇవ్వడం జరుగుతుందని డీజీపీ తెలియజేశారు.జిల్లాలో సైబర్ ఫిర్యాదులు పట్ల స్పందన,ప్రజలకు అవగాహన కల్పించడం,సైబర్ సెల్ నిర్వహణ,సైబర్ నేరాల నియంత్రణ టీమ్స్ గురించి ఎస్పీ వివరించారు.
జిల్లాలో బాధితులు వేగంగా ఫిర్యాదు చేయాలని అన్నారు.సైబర్ సెల్ సిబ్బంది యాక్టివ్ గా పని చేస్తున్నారన్నారు.
కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.అపరిచితులు పంపించే లింక్ లు,ఫోన్ కాల్స్,మెసేజ్ కు స్పందించ వద్దని,ఓటిపి వివరాలు,అకౌంట్ వివరాలు ఇతరులకు తెలపవొద్దని ఎస్పీ కోరారు.
అనలైన్ యాప్ లోన్స్ వల్ల నష్టం జరుగుతుందని అన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రితిరాజ్,డీసీఆర్బి డిఎస్పీ రెహమాన్,సిఐలు శ్రీనివాస్,నర్సింహ,నర్సింహారావు,నాగార్జున్,ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు.