గోరు వెచ్చని నీటిలో వీటిని కలిపి తాగితే.. చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం పొందడం ఖాయం ..?

చలికాలంలో( winter ) చలి పెరగడం వల్ల సిజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

 If You Drink These Mixed With Warm Water, You Will Surely Get Relief From The Di-TeluguStop.com

మన భారతీయ వంటగదిలో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర( Cinnamon, cloves, cumin, coriander ) ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు.వీటిని ఆహారం రుచి పెంచడానికి సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే ఆయుర్వేదంలో ఈ నాలుగు పదార్థాలను ఔషధంలా ఉపయోగిస్తారు.ఈ పదార్థాలలో అనేక పోషకాలు ఉంటాయి.

ఇవి అనేక సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర నీటిలో వేసి కలిపి కషాయం లా తయారు చేసుకుని తాగితే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

Telugu Cinnamon, Coriander, Cough, Cumin, Tips, Immunity-Telugu Health Tips

దీని వల్ల చలికాలంలో వచ్చే సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.చలి కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు ( Cold, cough )సమస్యలు వస్తూ ఉంటాయి.ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి రోజు జీలకర్ర, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క నీళ్లలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచడం ఎంతో ముఖ్యం.అందుకోసం నాలుగు పదార్థాలతో చేసిన పానీయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి( Immunity ) పెరిగి ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

Telugu Cinnamon, Coriander, Cough, Cumin, Tips, Immunity-Telugu Health Tips

అలాగే మన శరీరంలో ఉన్న చెడు వ్యర్ధాలు తొలగిపోవాలంటే ప్రతి రోజు ఈ గోరు వెచ్చని కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు వ్యర్ధాలు తొలగిపోయి శరీరం శుభ్రమౌతుంది.అలాగే బరువు తగ్గాలనుకునే వారు దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీరతో కలిపి చేసిన కషాయాన్ని ప్రతి రోజు ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల సులభంగా అధిక బరువు తగ్గుతారు.అలాగే ఈ నాలుగు పదార్థాలు శరీరంలోని చెడు కొవ్వును కూడా కరిగిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube