ప్రస్తుత సమాజంలో బరువు తగ్గడానికి( Weight Loss ) చాలామంది ప్రజలు జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే జిమ్ కు వెళ్లేవారు ఆహారం విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.
వ్యాయామానికి( Exercise ) ముందు మరియు తర్వాత మీరు తినే ఆహారం ( Food ) మీ శరీర పురోగతిని ప్రభావితం చేస్తుంది.ఇది బలమైన కండరాలు మరియు ఎముకల నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
మీరు కూడా జిమ్ కి వెళ్లే ముందు మరియు తర్వాత సరైన ఆహారం తీసుకోవాలనుకుంటే ఏమి తినాలి మరియు ఏమి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాయామానికి ముందు ఆరోగ్యకరమైన మరియు పూర్తిగా జీర్ణం అయ్యే భోజనం తీసుకోవడం ఎంతో అవసరం.ఇది మీకు శక్తిని అందిస్తుంది.అంతేకాకుండా వ్యాయామానికి సిద్ధంగా ఉంచుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే మీరు వ్యాయామానికి ఒకటి నుంచి రెండు గంటల ముందు కాస్త అల్పాహారం తీసుకోవాలి.ఇందులో మీరు పెరుగు, సూపర్ ఫుడ్స్, పండ్లు మొదలైనవి తీసుకోవచ్చు.
అలాగే వ్యాయామానికి ముందు సరైన మొత్తంలో నీటిని తీసుకోవడం ఎంతో మంచిది.

ఇలా చేయడం వల్ల మీ శరీరం పూర్తి శక్తితో సిద్ధంగా ఉంటుంది.వ్యాయామానికి ముందు కార్బోహైడ్రేట్లు తినడం వల్ల శక్తి లభిస్తుంది.మీరు చక్కెర, బియ్యం, బ్రౌన్ బ్రెడ్, తృణ ధాన్యాలు, అరటి పండ్లు మొదలైనవి తీసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే వ్యాయామానికి ముందు జున్ను, పెరుగు, వేరుశనగలు, గుడ్లు మొదలైన వాటిని తీసుకుంటూ ఉండాలి.ముఖ్యంగా చెప్పాలంటే వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగడం మంచి ఎంపిక.
ఎందుకంటే ఇది శరీర కండరాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది.మీరు పాలు, ప్రోటీన్ పౌడర్, పండ్లు గింజలు మొదలైన వాటిని ఉపయోగించవచ్చు.
పండ్లు మరియు కూరగాయలను కూడా వ్యాయామం తర్వాత తీసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే వ్యాయామం చేసిన తర్వాత ఉడకపెట్టిన గుడ్డు తినడం ఎంతో మంచిది.