హెల్తీ ఫై హాస్పటల్లో అరుదైన ఆపరేషన్

సూర్యాపేట జిల్లా:కార్పొరేట్ స్థాయిలో విజయవంతంగా అరుదైన ఆపరేషన్లు చేసి ప్రజల మన్ననలు పొందుతున్న సూర్యాపేట జమ్మిగడ్డకు చెందిన హెల్తిపై హాస్పిటల్.గతంలో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ లతోపాటు ఎన్నో విజయవంతమైన ఆపరేషన్ చేసి చేసిన హెల్తీ పై హాస్పిటల్ డాక్టర్లు గురువారం ఒక రోగి కడుపులో 10 లీటర్ల వాటర్ తో కూడుకున్న 27 సెంటీమీటర్ల అండాశయ తిత్తిని తొలగించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.

 A Rare Operation In Healthy Fi Hospitals-TeluguStop.com

డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన మేడబోయిన సైదమ్మ (65) గత మూడు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఎన్నో హాస్పటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంది.ఎందరో డాక్టర్లు హైదరాబాదులో ఆపరేషన్ చేయించాల్సిందిగా సలహా ఇవ్వడం జరిగింది.

కొంతమంది సమాచారం మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హెల్తిపై హాస్పిటల్ వారిని సంప్రదించగా అధునాతనమైన లేప్రోస్కోపింగ్ ద్వారా రెండు గంటలలో ఆపరేషన్ విజయవంతం చేసి రోగి కడుపులోని అండాశయ తిత్తిని తొలగించి ప్రాణాలు కాపాడారు.ఈ సందర్భంగా రోగి కుమారుడు మేడబోయిన సోమరాజు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మా తల్లి కడుపునొప్పితో బాధపడుతున్నారని,ఎంతోమంది డాక్టర్లకు చూపించిన హైదరాబాదులో ఆపరేషన్ చేయించుకోవాలని, సుమారు అయిదు లక్షల ఖర్చు అవుతుందని తెలిపారని,హెల్తీ పై హాస్పిటల్ విషయం తెలియడంతో ఇక్కడ చేర్పించగా విజయవంతంగా ఆపరేషన్ చేశారని కొనియాడారు.

మా తల్లి మాకు జన్మనిస్తే హెల్తీ పై హాస్పిటల్ వారు మా అమ్మకు పునర్జన్మను ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.లక్షల్లో ఖర్చయ్యే ఆపరేషన్ అతి తక్కువ ఖర్చుతో హెల్తీ పై హాస్పిటల్ వారు చేసి తమ తల్లి ప్రాణాలు కాపాడినందుకు హాస్పిటల్ డాక్టర్లకు,సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube