సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్నబియ్యం పథకంలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.ఈ పథకం రేషన్ కార్డుదారులకు సంతోషం కలుస్తుంటే కొందరికి మాత్రం పరేషాన్ గా మారింది.
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కొన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి పాత రేషన్ కార్డుదారులతో పాటు, కుటుంబ సర్వే చేస్తున్నారు.గ్రామసభల్లో ఎంపికైన వారికే డీలర్లు బియ్యం ఇస్తున్నారు.
గతంలో కొత్త రేషన్ కార్డు కోసం పాత కార్డులో పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఇవ్వకపోవడంతో లబ్దిదారులు తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు.కొత్త కార్డుల మంజూరు చేస్తారని దరఖాస్తు చేస్తే ఉన్న పేరు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే సంబంధిత అధికారులు మాత్రం 360° డిగ్రీస్ లో పరిశీలన చేస్తున్నామని రేషన్ కార్డు దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ఇది నిరంతర ప్రక్రియని చెబుతున్నారు.