సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో శనివారం గడ్డిలోడుతో వస్తున్న ట్రాక్టర్ కు విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని గడ్డి పూర్తిగా దగ్ధమైంది.వెంటనే అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ హైడ్రాలిక్ ద్వారా గడ్డి లోడు కింద పడేయడంతో పెనుప్రమాదం తప్పింది.
గ్రామానికి చెందిన గొట్టిముక్కల లింగారెడ్డికి చెందిన వ్యవసాయ పొలం నుంచి ఈ గడ్డి లోడు తెస్తున్నట్లు తెలుస్తోంది.







