సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో గాడాంధకారం అలముకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.వీధి దీపాలు వెలగక పోవడంతో 3వ,4వ తోపాటు పలు వార్డుల్లో చిమ్మచీకట్లు అలముకుంటున్నాయి.
గత కొన్ని నెలలుగా ప్రజలను ఈ సమస్య పట్టిపీడిస్తున్నా అధికారులకు పట్టడం లేదు.అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
ఫలితంగా వీధిలైట్లు ఎప్పుడు వెలుగుతాయో ఎప్పుడు ఆరిపోతాయో తెలియని అయో మయ పరిస్థితి నెలకొంది.గ్రామంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
దీనిలో భాగంగా భక్తులు దేవి దర్శనానికి రాత్రి వేళల్లో పూజలో పాల్గొనేందుకు వస్తున్నారు కాగా వీధుల్లో లైట్స్ లేకపోవడంతో ప్రజలు అంధకారంలో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాలను వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.