యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ పరిధిలోని బాలాజీ క్రషర్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో క్రషర్ మిషన్ వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా ఉండడం వల్లనే పంటలపై దుమ్ము పడి పంటల పండక రైతులు నష్టపోతున్నారని,రైతులు పండించిన వరి,కూరగాయలు, ఇతర పంటలు అమ్ముకోలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పరిమితికి మించి 16 టైర్ లారీలో ఓవర్ లోడ్ చేయడం వల్ల మర్యాల గ్రామము నుండి చీకటిమామిడి వరకు వెళుతున్న రోడ్డు గుంతల మయమై రోడ్డులో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని,లారీలు వెళ్తున్న సమయంలో ప్రయాణికులు పైన దుమ్ము పడిపోతున్నారని బండి స్కిడ్ అయి పడిపోతున్నారని, యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ పర్మిషన్ కి మించి బ్లాస్టింగ్ వేయడం వల్ల ఇండ్లు బోర్లు కూలిపోతున్నాయని,బోర్లలో మోటర్లు ఇరుక్కుపోయి నీళ్లు రావడం లేదని,రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, బాంబుల శబ్ద కాలుష్యం వల్ల హార్ట్ ఎటాక్ ఉన్న పేషెంట్లు అనారోగ్యాల గురై హాస్పిటల్ పాలవుతున్నారని వాపోయారు.
ప్రజల జీవన విధానానికి ఆటంకం కలిగించే బాలాజీ క్రషర్ యాజమాన్యం పైన ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శ్రీశైలం, గ్రామ కార్యదర్శి ముద్ద మధుసూధన్ రెడ్డి,దేశెట్టి సత్యనారాయణ, మోకు దేవేందర్,ప్యారారం వెంకటేష్,శ్రీపతి రాములు తదితరులు పాల్గొన్నారు.