నల్లగొండ జిల్లా:వరి పంటను తేమ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.మంగళవారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వడ్ల కుప్పలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మద్దతు ధర ప్రకటించి,కొనుగోలు కేంద్రాలలో దళారుల బెడద లేకుండా చూసి మద్దతు ధర ఇవ్వాలన్నారు.పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వస్తుందని,
అందుకే తేమ శాతం చూడకుండా కొనుగోలు చేసుకోవాలని, ఓట్లు రైస్ మిల్లర్లతో మాట్లాడి త్వరగా లారీలు వచ్చే విధంగా చూడాలని, వర్షాలు వస్తే పట్టాలు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ(ఎం) మహాసభల నిర్వహణ జరుగుతుందని,అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.గత కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలకు ఉద్యమాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి,మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం,కొమ్ము లక్ష్మయ్య,పల్లేటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.