వికలాంగుల పెన్షన్ రూ.6000 వెంటనే ఇవ్వాలి:కొత్త వెంకన్న డిమాండ్

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వికలాంగుల పెన్షన్ రూ.6000 వెంటనే ఇవ్వాలని విహెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

 Disability Pension Of Rs 6000 Should Be Given Immediately Kottha Venkanna Demand-TeluguStop.com

కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలులో వికలాంగులకు మొదటి ప్రధాన్యత ఇవ్వాలన్నారు.ఈనెల 26 న హైదరాబాదులో పెన్షన్ల సాధన కోసం మంద కృష్ణ మాదిగ చేపట్టిన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విహెచ్ పిఎస్ రాష్ట్ర నాయకులు హైమద్ ఖాన్,నల్గొండ జిల్లా మహిళ అధ్యక్షురాలు చైతన్య, సీనియర్ నాయకులు శీలం సైదులు,వెంకన్న, సైదులు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube