నల్లగొండ జిల్లా(Nalgonda District):నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం గోరింకలపల్లి,మంగళపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ(Tripathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తేమ శాతాలు,తరుగు,తాలు, మట్టిపెళ్ళల వంటివి లేకుండా ధాన్యాన్ని కనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు,నాయకులు పాల్గొన్నారు.
.