నల్లగొండ జిల్లా:ప్రజా పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వేములపల్లి ఎంపీపీ పుట్టల సునీత అన్నారు.శనివారం రావులపెంట గ్రామంలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూప్రజా పాలనకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వస్తుందన్నారు.
ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు పరిచామని, మిగిలిన గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు పరుస్తామని స్పష్టం చేశారు.ప్రజల వద్దకే పాలన అందిస్తామని, రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
రేషన్ కార్డుల గురించి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి,ఉప సర్పంచ్ సైదులు, తాహసిల్దార్ శ్రీనివాస శర్మ, ఎంపీడీవో జానయ్య, ( MPDO Janaiah, )ఎంపిఓ సంగీత,ఆర్ఐ మహేందర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ రామ్ రెడ్డి() Secretary Ram Reddy ),పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.