సమగ్ర కులగణన విజయవంతం చేయాలి:బీసీ సంక్షేమ సంఘం నేత తన్నీరు రాంప్రభు

సూర్యాపేట జిల్లా:స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఏ పార్టీ కూడా సమగ్ర కులగణన చేయలేదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుల గణనను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభు కోరారు.శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీసీ కులాల,వివిధ పార్టీ నాయకుల సమక్షంలో బీసీ సమగ్ర కుల గణన చైతన్య వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.

 Comprehensive Caste Census Should Be Successful: Bc Welfare Association Leader T-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేసి,జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని,స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగిందన్నారు.దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కులాలు,బీసీ సంఘాలు ఐక్యతగా నిలబడి కులగణన సాధించుకోవడం కోసం, రిజర్వేషన్లను సాధించుకోవడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన హామీని నెరవేర్చాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి సమగ్ర కులగణన చేయడానికి జీవో నెంబర్ 18 ని తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు.కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతున్నది కాబట్టి అన్ని కులాలు సహకరించి మన కులం యొక్క పేరును ఖచ్చితంగా చెప్పి మనం కులం యొక్క గౌరవాన్ని,అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కోరారు.

ఈ కులగణన జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లోని 136 కులాలు విద్యాపరంగా,ఉద్యోగ పరంగా,సామాజికపరంగా,రాజకీయపరంగా అన్నిరంగాలలో అవకాశాలు దొరకడం జరుగుతుందన్నారు.కాబట్టి ఇంతవరకు రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలు కూడా రాజకీయ ప్రాతినిధ్యం లభించడం జరుగుతుందన్నారు.

అదే విధంగా ప్రతి కులానికి కూడా వారి యొక్క జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అనేక రకాల సంక్షేమ పథకాలలో అన్ని కులాలకు కూడా అవకాశాలు కూడా దొరకడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు సమగ్ర కులగణనను విజయవంతం చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పెద్దబోయిన అజయ్,కొండ రాజు,బ్రహ్మం, ముద్దంగుల యాదగిరి, ఎల్సోజు చంటి,కటకం వెంకటేశ్వర్లు,పులుసు వెంకటనారాయణ,పులుసు వెంకన్న,కటకం సూరయ్య, అంబటి రాములు,పెండెం మసూదన్,అక్కినపల్లి రాములు,ఆనగందుల సంజీవ, ఎండి రఫిక్,కొండా రవి, గోపగాని రమేష్,కోరుకొప్పుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube