ముగిసిన రెండో రౌండ్ ఎమ్మెల్సీ బై పోల్ కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

నల్లగొండ జిల్లా: నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండవ రోజు కొనసాగుతున్నది.సుదీర్ఘంగా సాగుతున్న లెక్కింపులో ఇప్పటివరకు రెండు రౌండ్లు పూర్తయ్యాయి.96 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతు న్నారు.రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి తన సమీప అభ్యర్థి రాకేశ్‌ రెడ్డిపై (బీఆర్‌ఎస్‌) 14,672 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

 The Second Round Of Mlc By Poll Counting Has Ended Teenmar Mallanna Is In The Le-TeluguStop.com

ప్రస్తుతం మూడో రౌండ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.

తొలి రెండు రౌండ్లలో మల్లన్నకు 7,670 ఓట్లు,7,002 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

మొదటి రౌండ్‌లో మల్లన్నకు 36,210 ఓట్లు రాగా,రాకేశ్‌ రెడ్డికి 28,540 ఓట్లు వచ్చాయి.బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 9,109 ఓట్లు పోలయ్యాయి.

ఇక మల్లన్నకు రెండో రౌండ్‌ లో 34,575 ఓట్లు,బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 27,573,బీజేపీకి 12,841 ఓట్లు,అశోక్‌కు 11,018 ఓట్లు వచ్చాయి.ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube